calender_icon.png 1 December, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిప్పల నర్సింగరావు

01-12-2025 12:29:50 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జాతీయ లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిప్పల నర్సింగ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన చిప్పల నర్సింగ్ రావు మాట్లాడుతూ... నాపై ఎంతో నమ్మకంతో జాతీయ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చిరాకు పాస్వాన్, రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్, జాతీయ కార్యదర్శి మున్నీర్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ రావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్ జనశక్తి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.