24-06-2025 08:35:14 PM
పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రైతులు...
భద్రాచలం (విజయక్రాంతి): దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో రైతు వేదిక నందు మంగళవారం మండల నాయకులు, రైతుల ఆధ్వర్యంలో రైతు బంధు పథకం ద్వారా 9 రోజుల్లో రూ 9 వేల కోట్ల నిధులు రైతుల ఎకౌంట్లో మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్కకి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుకి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు(MLA Dr. Tellam Venkat Rao) పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.