06-11-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఓటర్లను బెదిరించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమ ర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోరబండలో కాంగ్రెస్ వేధింపులు తట్టుకోలేక సర్దార్ అనే బీఆర్‌ఎస్ కార్యకర్త ఆత్మహ్యత చేసుకున్నాడని ఆరోపించారు. వ్యాపారాలు ఉన్న బీఆర్‌ఎస్ నేతల ను బెదిరిస్తూ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నేర చరిత్ర ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.
అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తు లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను మురికి నగరం మార్చారని, డీసీపీ మీద దాడులు చేసే పరిస్థితి నగరంలో ఉందన్నారు. దండుపాళ్యం ముఠా మొత్తం జూబ్లీహిల్స్‌లో ఉన్నదని, అయినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.