07-10-2025 07:59:53 PM
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే బీసీల 42 శాతం రిజర్వేషన్ల పిటిషన్లపై బుధవారం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరుపనున్నారు. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.
హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోర్టులో అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. హాజరయ్యారు.
బీసీల 42 శాతం రిజర్వేషన్ అంశంపై రేపు హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్న దానిపై తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. జీవో 9ని హైకోర్టు కొట్టివేస్తుందా.? సమర్థిస్తుందా.? రెండు పిటిషన్లపై విచారించనున్న ధర్మాసనం పిటిషనర్లపై ప్రత్యేక బెంచ్ ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు.