calender_icon.png 15 November, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం

09-09-2024 12:29:45 PM

హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని ‘తెలంగాణ భాషా దినోత్సవం’జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, భాషకు కాళోజీ చేసిన సేవలను స్మరించుకోవడంలోని విశిష్టతను తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.