24-07-2024 05:05:54 PM
కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలి
రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ
సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుడో..
హైదరాబాద్: ఢిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్షనేత కేసీఆర్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తే.. ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాను సిద్ధం అన్నారు. కేసీఆర్ వస్తే.. జంతర్ మంతర్ వద్ద తాను దీక్షలో కూర్చంటానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాలక పక్షనేతగా నేను వస్తా.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా నేను సిద్దమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలని తేల్చిచెప్పారు.
అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంత్రి వర్గంతో ఆమరణ దీక్షకు కూర్చోవాలన్నారు. వాళ్లకు తాము అండగా ఉంటామని సూచించారు. కేంద్రంతో కొట్లాడుదాం.. అందరం పోయి కూర్చుందాం.. అంతు చూద్దాం.. నిధులు తీసుకోద్దామని కేటీఆర్ పేర్కొన్నారు