calender_icon.png 20 November, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రంతో కొట్లాడుదాం.. నిధులు తీసుకోద్దాం: కేటీఆర్

24-07-2024 04:45:52 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడుదామని కేటీఆర్ పిలుపున్చిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏకతాటిపైకి వచ్చి పోరాడుదామని కోరారు. కేంద్రమంత్రులు నిధులు తెస్తారో..  రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ''ముఖ్యమంత్రి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంత్రి వర్గంతో ఆమరణ దీక్షకు కూర్చోవాలి.. వాళ్లకు తాము అండగా ఉంటాము కేంద్రంతో కొట్లాడుదాం.. అందరం పోయి కూర్చుందాం అంతు చూద్దాం.. నిధులు తీసుకోద్దాం'' అని కేటీఆర్ పేర్కొన్నారు.