20-11-2025 07:56:41 PM
స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు మావే.
హుజురాబాద్ ప్రజలను నేనెప్పుడూ మర్చిపోను.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్.
హుజురాబాద్ (విజయక్రాంతి): రైతులు తుఫాను బీభత్సంతో నానా కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవడంలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చాయి కానీ కాంటాలు లేవు, మిల్లులో రోజు తరబడి దాన్యం దింపుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని బాపోయారు. ఇంటలకి 8 కేజీల తరువు తీస్తున్న తీస్తూ.. అరుగాలం కష్టపడితే ఈ దోపిడీ ఏందీ అని రైతులు నిలదీస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాబడులకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఎవరికీ అందలేదని వెంటనే రైతులకు బోనస్ పైసలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన 10000 నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నన్ను 25 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్న గడ్డ హుజరాబాద్ అని ఈ ప్రాంత ప్రజలని ఎప్పుడు మర్చిపోను అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లు మేమే గెలుస్తామని, సర్పంచులను, వార్డు మెంబర్లను, ఎంపీటీసీ లను గెలిపించుకునే బాధ్యత నాదేనని అన్నారు. నేను ఎమ్మెల్యే గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఏడాదిగా ఏం చేశారని ధర్నా చేశారు. ఇప్పుడు గెలిచి రెండేళ్లు అవుతుంది ఏం అభివృద్ధి చేశారు అని ప్రశ్నించారు. ప్రజలు చీకట్లో ఉండి పోయినంబిడ్డ అని ఏడుస్తున్నారు. ఏదో అయిపోయింది అప్పుడప్పుడు రా బిడ్డ అని ప్రజలు అడుగుతున్నార అని అన్నారు. మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకునే వ్యక్తిని కాదని ప్రజలను నమ్ముకునే వ్యక్తిని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పోతుల సంజీవ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.