20-11-2025 07:53:33 PM
లయన్స్ క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ గుడి పూరి వెంకటేశ్వరరావు
తుంగతుర్తి (విజయక్రాంతి): సమాజంలో పేద ప్రజలకు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేని అని లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ గుడి పూరి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో కీర్తిశేషులు ఓరుగంటి సత్యనారాయణ జ్ఞాపకార్థం సూర్యాపేట లయన్స్ క్లబ్ సౌజన్యంతో సుమారు 120 మంది ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, ఉచిత ఆపరేషన్లు నిర్వహించారు. సమాజంలో పేద ప్రజలకు సేవలు అందించుటకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరారు. గ్రామాల్లో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఓరుగంటి సత్యనారాయణ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి కొండల్ రెడ్డి తుంగతుర్తి లయన్స్ అధ్యక్షులు పాలవరపు సంతోష్, ప్రధాన కార్యదర్శి గుండ గాని రాము, ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, పప్పుల వెంకన్న ఎనగందులగిరి ఎనగందుల సంజీవ, ఓరుగంటి సుశీల ఓరుగంటి సుభాష్ ఓరుగంటి శ్రీనివాస్ ఓరుగంటి శోభారాణి, పులుసు వెంకటనారాయణ గౌడ్, ఎనగందుల శ్రీనివాస్, క్లబ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.