హైదరాబాద్ : శాసన సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. 'కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం' తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించడంతో శాసన సభ రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపిందని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. కేంద్ర బడ్జెట్ ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.