20-11-2025 07:59:17 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ముదిరాజ్ సంఘం ఎన్నికలు జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, దేవుని నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా బోన్డ్ల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా బొజ్జ దేవరాజు, ఉపాధ్యక్షుడిగా మల్ల బోయిని ఆనందం, సహాయ కార్యదర్శిగా భీమరి రాములు, కార్యదర్శిగా పోచయ్య, కోశాధికారిగా వెంకటేశం, సలహాదారులుగా పసుపుల తిరుపతి, కాటు మల్లేశం, రెడ్డవేని మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు మండల ముదిరాజ్ సంఘం అభివృద్ధి కోసం సమగ్రంగా కృషి చేస్తారని ఆ నియమితులు తెలిపారు.