20-11-2025 08:01:16 PM
మిర్యాలగూడ (విజయక్రాంతి): ఆడపిల్లల సంరక్షణ సామాజిక బాధ్యత అని దామరచర్ల సీడీపీఓ చంద్రకళ అన్నారు. దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోని బొత్తలపాలెం మోడల్ స్కూల్ లో గురువారం బేటీ బచావో బేటీ పడావో సదస్సు నిర్వహించి మాట్లాడారు. దంపతులు ఆడపిల్ల సంతానం భారంగా పరిగణించ వద్దన్నారు. వారి సంరక్షణకై అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక ఆహరం అందిస్తోందన్నారు. వారిని చదువులో ప్రోత్సహించేలా ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.
కిషోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతభ్రత పాటించాలని, బాల బాలికల హక్కులు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగహన కలిగి ఉండాలన్నారు. అఘాయిత్యాల నుంచి పోక్సో చట్టం ద్వారా రక్షణ పొందాలని కోరారు. అనంతరం విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండేలా నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సంధ్యారాణి, మాధవి, పోషన్ అభియాన్ బిసి రమణి, ప్రిన్సిపల్ నరహరి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.