20-11-2025 07:48:06 PM
చొప్పదండి (విజయక్రాంతి): కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవే అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఫార్ములా– ఈవెంట్‌కు సంబంధించిన కేసులను కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఫార్ములా-ఈరేస్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా–ఈరేస్ నిర్వహించబడిందని, దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఉపయోగిస్తున్నందుకు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వక్రీకరించడం ప్రజలకు మోసం చేయడమేనని సుంకె రవిశంకర్ అన్నారు.. కేటీఆర్‌పై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రతీకారమే అని, పరిశీలన పూర్తయ్యాక నిజం బయటికొస్తుందని ఆయన అన్నారు.