calender_icon.png 20 November, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశుమందిర్ రోడ్డు బాధితుల ఆందోళన

20-11-2025 07:44:59 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శిశుమందిర్ రోడ్డు విస్తరణ బాధితులు గురువారం రాత్రి రోడ్డుకు అడ్డంగా కూర్చొని ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గత 70 ఏళ్లుగా ఇదే రోడ్డుపై నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనాన్ని పొందుతున్న తమకు రోడ్డు విస్తరణ పనులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధిని దెబ్బతీసే విస్తరణ పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అభివృద్ధి పేరిట జీవనోపాధిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా శిశుమందిర్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. బాధితుల ఆందోళనతో చిన్నభూధ, బెల్లంపల్లి వైపుకు వాహనాలు ఇక్కడిక్కడ నిలిచిపోయాయి. గొడవ జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులతో చర్చించి ఆందోళన విరమించాలని సూచించినప్పటికీ వారు వినలేదు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మున్సిపల్ సిబ్బంది తెలపడంతో వారు ఆందోళన విరమించారు.