16 April, 2026 | 8:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

21-04-2025 05:05 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రోమన్ కాథలిక్ చర్చి అధిపతి, వాటికన్ నగర సార్వభౌమాధికారి అయిన హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రపంచ అసమానతలపై పోరాటంలో పోప్ అవిశ్రాంత కృషిని ప్రశంసిస్తూ ఆయన పోప్ ఫ్రాన్సిస్ కు ఘనమైన నివాళులు అర్పించారు. ప్రపంచ శాంతిని నెలకొల్పే వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ అద్భుతమైన పాత్రను, శరణార్థులు, వలసదారులకు ఆయన తిరుగులేని మద్దతును ముఖ్యమంత్రి కొనయాడారు. పోప్ సమ్మిళిత, కరుణామయ విధానం ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు.

ఆయనను ఒక మహోన్నత ఆధ్యాత్మిక వ్యక్తిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని చర్చి, మానవాళి సేవకు అంకితం చేశారని గుర్తు చేశారు. మతాంతర సామరస్యం పట్ల పోప్ నిబద్ధత, వాతావరణ మార్పులపై అవగాహన కోసం ఆయన వాదన, ప్రపంచ సంఘీభావంతో ఐక్యమైన ప్రపంచం అనే ఆయన దార్శనికతను సీఎం ప్రశంసించారు. ఆయన మృతి మానవాళికి తీరని లోటని అభివర్ణిస్తూ, పోప్ కుటుంబానికి, ప్రపంచ కాథలిక్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.