21-04-2025 02:03:39 PM
రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటిలేదు
త్వరలోనే రైతు భరోసా నిధులు..
పంట నష్టపోయిన వారికి త్వరలోనే పరిహారం
హైదరాబాద్: పసుపు పంటకు మద్ధతు ధర వస్తేనే.. పసుపురైతు(Turmeric farmer) తలెత్తుకుని ఉండగలడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవాన్ని(Nizamabad Rythu Mahotsav) మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవం సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ... రైతు సంక్షేమ కార్యాక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే రాష్ట్రం మరొకటి లేదని చెప్పారు. తెలంగాణకు పసుపుపారాణి లాంటిది నిజామాబాద్ జిల్లా అని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణ అన్నారు. కొన్ని కారణాల వల్ల రైతుభరోసా అర్ధవంతరంగా నిలిచిపోయిందని మంత్రి వివరించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైభరోసా నిధులు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిన మిగతా అన్ని పథకాలను నిలిపి వేసిందని మంత్రి ఆరోపించారు.
అకాల వర్షాలతో పంటనష్టపోయిన వారికి త్వరలోనే పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. నష్టాలు వస్తున్నప్పటికీ అన్ని పంటలను మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు వ్యవసాయ యంత్ర పరికరాలను ఇవ్వలేదని చెప్పిన మంత్రి తుమ్మల ఈ ప్రభుత్వం మళ్లీ యంత్రపరికరాల పంపిణీని పునరుద్ధరించిందని తెలిపారు. ప్రతి జిల్లాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నదని వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చాలా పెరగాల్సిఉందని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేయకపోతే రైతులే నష్టపోయే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. 4 ఎకరాల వరి సాగుతో వచ్చే లాభం ఎకరం ఆయిల్ పామ్ తోటతో వస్తుందని రైతులకు మంత్రి తుమ్మల సూచించారు. దేవరకొండలో ఒక రైతు కుంకుడుకాయల సాగుతో రూ. 6 లక్షలు సంపాదిస్తున్నారని వ్యవసాయ మంత్రి వెల్లడించారు.