24-07-2024 10:59:08 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని తండాలను మండల కేంద్రం నుంచి బీటీ రోడ్డు వేస్తామని సీఎం వెల్లడించారు. అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల వైఖరి ఇంకా మారలేదని ఆయన విమర్శించారు. తప్పులు చేశారు.. ప్రజలు శిక్షించారు.. అయినా మారలేదని సీఎం సూచించారు. బీఆర్ఎస్ నేతలకు మంచిబుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. రోడ్డు సరిగాలేక ప్రమాదాలు జరిగి అనేకమంది చనిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తండాలను అభివృద్ధి వైపు నడిపించాలని నిర్ణయించామని వెల్లడించారు.