calender_icon.png 20 November, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల

19-11-2025 11:13:31 PM

కార్యక్రమాన్ని తిలకించిన రైతులు..

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడత నిధుల విడుదల సందర్భంగా బుధవారం పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ క్యాంపస్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సహజ వ్యవసాయ కార్యక్రమం’ వేదికగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు నిధులను విడుదల చేశారు. ఈ ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 100 మంది రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు.

ప్రధానమంత్రి ప్రసంగం, నిధుల విడుదల ప్రక్రియను రైతులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వెటర్నరీ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డా. ఎం.కిషన్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి-కిసాన్ సమ్మాన్ పథకం రైతుల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు. ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి ఖర్చులకు సహాయం అందుతుందన్నారు. సాగు ఖర్చులు తగ్గితే వ్యవసాయ లాభసాటిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేట్ డీన్ డా డీ.మాధురి మాట్లాడుతూ రైతులను సాంకేతికతతో అనుసంధానం చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. ఈ సమావేశం లో విస్తరణ విభాగం అధిపతి డా.సీ హెచ్ సత్యనారాయణ, డా. సీ హెచ్ రామకృష్ణలు పాల్గొన్నారు.