19-11-2025 10:57:35 PM
ప్రైవేట్ స్కూల్ నిర్వాకం..
3 ఏళ్ళ బాలుడికి గాయాలు..
అలంపూర్: తాను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదని ఓ టీచరు 3వ క్లాస్ బాలుడిని మోకాళ్లపై నడిపించింది. హృదయ విషాదకర ఈ ఘటన వడ్డేపల్లి మండల పరిధిలోని జూలకల్లులో జరిగింది. కొంకలకు చెందిన టీజీ ఉదయ్ కుమార్ జూలకల్లు గ్రామంలోని శారద విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేదని మంగళవారం మండే ఇసుకలో నడిపించడంతో గాయాలయ్యాయి. బుధవారం తండ్రి రంగన్న ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు ఎంఈవో నరసింహ తెలిపారు.