calender_icon.png 20 November, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంధమల్లపై రూపాయి పని కూడా జరగలేదు: మంత్రి ఉత్తమ్

24-07-2024 11:11:16 AM

హైదరాబాద్: తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. గంధమల్లపై ఇప్పటిరకు రుపాయి పనికూడా జరగలేదని ఉత్తమ్ వెల్లడించారు. గంధమల్ల భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తామన్నారు. 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే గంధమల్ల మునిగిపోతుందని స్పష్టం చేశారు. గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. ఎంత కెపాసిటీతో గంధమల్ల నిర్మాణంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.