31-07-2024 12:21:46 PM
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ ను విమానాశ్రయం వరకు వేస్తామంటే కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఎందుకివ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదని వెల్లడించారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగ మార్చుతామనలేదని సీఎం తెలిపారు. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సభ తప్పదోవ పట్టించడానికి కేటీఆర్ కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేశారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి. ప్రజలకు అనుభవాలు ఉన్నాయన్నారు. మీ పాలన అనుభవాలతో ప్రజలు తమకు అధికారం ఇచ్చారని చెప్పారు. పది నెలలు పూర్తి కానీ తమ పాలనపై వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు మీ బినామీలకు ఇచ్చి.. సూరత్ నుంచి తీసుకువచ్చారా..? బతుకుమ్మ చీరల విషయంలో ఆడబిడ్డలు తిరుగుబాటు చేశారా..? లేదా..? చెప్పాలన్నారు. సూరత్ నుంచి చీరలు తీసుకువచ్చి పేదలను మోసం చేశారని విమర్శించారు.