calender_icon.png 10 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అంటే జెలసీ తప్ప.. మీకు ఏ పాలసీలేదు: కేటీఆర్

31-07-2024 12:41:38 PM

ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటనేది ప్రజలకు తెలుసు

ఎంఎంటీఎస్ విషయంలో కేంద్రం సహకరించలేదు

హైదరాబాద్: కేసీఆర్ అంటే జెలసీ తప్ప మీకు ఏ పాలసీలేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.... ఇప్పటివరకూ కాంగ్రెస్ తెచ్చిన పాలసీయే లేదని కేటీఆర్ ఆరోపించారు. నేను చదువుకున్నా, కష్టపడ్డా, సీఎం రేవంత్ రెడ్డి ఏం  చదువుకున్నారనేది నాకు తెలియదన్నారు. ఎవరి ఇంటేలిజెన్స్ ఏంటనేది ప్రజలకు తెలుసన్నారు. ప్రొటో కాల్ పాటిస్తే ఎక్కడికైనా వస్తామని తెలిపిన కేటీఆర్ ఓడినవారిని వేదికపై కూర్చోబెట్టి, గెలిచినవారిని కింద కూర్చోబెట్టొద్దని సూచించారు. తమ ఎమ్మెల్యేలను గౌరవిస్తే తప్పకుండా వస్తారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ. 1800 కోట్ల బకాయిలు కట్టామన్నారు. బతుకమ్మ చీరల విషయంలో రేవంత్ రెడ్డి నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. తొలిసారి మాత్రమే కొంత ఆర్డర్ చీరలను కొనుగోలు చేశామని తెలిపారు. కరోనాతో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంఎంటీఎస్ పనులు చేపట్టలేదని వెల్లడించారు. ఎంఎంటీఎస్ విషయంలో కేంద్రం కూడా సహకరించలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.