calender_icon.png 14 May, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలసౌధకు సీఎం రేవంత్ రెడ్డి

14-05-2025 09:41:03 AM

కొత్తగా నియమితులైన ఏఈలు, జేటీవోలకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సాయంత్రం జలసౌధకు వెళ్లనున్నారు. కొత్తగా నియమితులైన ఏఈ, జేటీవోలకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం నీటిపారుదల అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(Telangana Core Urban Region) పై కూడా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతరాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.