calender_icon.png 14 May, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. తండ్రి కుమార్తె మృతి

14-05-2025 09:30:50 AM

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం(Veldanda Mandal) జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపు తప్పిన కారు ఆగి ఉన్న డీ సీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ప్రమాదంలో కుమార్తె తేజశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండం నెల్లికుదురు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.