calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు తలసాని ప్రోత్సాహం

20-08-2025 01:54:55 AM

సనత్‌నగర్ ఆగస్టు 19 (విజయ క్రాంతి):- అంతర్జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటి హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు.

సనత్ నగర్ లోని వాల్మీకి వ్యాయామశాల కు చెందిన రవిసింగ్, ప్రియాంక పట్నాయక్ లు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన సందర్భంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ నెల 2 నుండి 7 వ తేదీ వరకు కేరళ లోని కోజికోడ్ లో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో రవి సింగ్ 93 KG ల కేటగిరి లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించగా, 52 KG ల విభాగంలో ప్రియాంక పట్నాయక్ సిల్వర్ మెడల్ ను గెలుచుకుంది.

వీరిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అనేక పోటీలలో పాల్గొని మరిన్ని మెడల్స్ ను సాధించాలని అన్నారు. తన ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. తమ వ్యాయామశాల అభివృద్ధి కి ఎంతో సహకారాన్ని అందించారని ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.