12-11-2025 02:41:00 PM
హైదరాబాద్: అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో హాజరయేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇలరాత్రి 8 గంటలకు ఢిల్లీ బయల్దేరనున్న సీఎం రేపు ఉదయం 9 గంటలకు సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9వ తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నట్లు సమాచారం.