12-08-2025 01:23:17 AM
- అమీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్
సనత్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి):- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తమ బస్తీల్లో పర్యటించడం చాలా సంతోషకరమని అమీర్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వర్షాల వల్ల తమ డివిజన్‌లోని బల్కంపేట, గంగూబాయి బస్తీ, బుద్ధ నగర్లో భారీగా వరదనీరు పోటెత్తుతుందని తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి స్వ యంగా వచ్చి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు.
బస్తీ ల్లో కలియతిరుగుతూ పిల్లాపెద్ద అందరిని పలకరించిన విధానం చూపరులను కట్టిపడేసిందన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆకస్మికంగా పర్యటించి సామాన్యులతో ఒక సామాన్యుడిలాగా మమేకం అవడం సాధారణ విషయం కాదన్నారు. చరిత్రలో ఇలాం టి ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సనత్ నగర్ నియోజకవర్గం అంటే ప్రత్యేక అభిమానం ఉందని అందులో భాగంగానే అ యనే స్వయంగా పర్యటించారని తెలిపారు.
సీఎం రాకతో దశబ్దాల నాలా సమస్యకు పరిష్కారం లభిస్తోందన్నారు. మరోవైపు స్థాని కుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంట నే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ముఖ్యమం త్రే స్వయంగా సూచించారని చెప్పారు.
ప్రజపాలనలో ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తోం దన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పట్ల చాలా గర్వపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నవీన్ రాజు, శ్రీకాంత్ యాదవ్, ప్రతాప్ నాయక్, రవీందర్, కటకం భాస్కర్, సత్యనారాయణ యాదవ్, గోదాస్ నవీన్, మహేశ్, నరేష్, సాయి గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.