12-08-2025 01:23:07 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో సోమవారం ఆటల పోటీలు నిర్వహించారు. 15వ అదనపు జిల్లా జడ్జి ప్రదీప్‌నాయక్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి, అదనపు సీనియర్ రెటాలాల్ చందు, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ హిమబిందు ప్రారంభించారు.
ఆటలతో మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను పొందవచ్చు అని, ఆరో గ్యంగా ఉండవచ్చు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్ కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ సభవత్ జైపాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రామకృష్ణ, కే మల్లేష్, సీనియర్ న్యాయవాదులు గులాం హైదర్, అంజన్‌రెడ్డి, జేపీ మహేందర్, నారాయణరెడ్డి, గణేష్ కుమార్ పాల్గొన్నారు.