12-08-2025 01:24:32 AM
జీఈఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో చెరువు పునరుద్ధరణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11: ఫ్రీడమ్ హెల్థీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారులు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) తమ సిఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండిఏ, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (టీఎస్‌ఐజి తెలంగాణ ప్రభుత్వ సిఎస్‌ఆర్ విభాగం), ధ్రువంశ్ ఎన్జీవోతో కలిసి కోకాపేటలోని కొత్త చెరువులో సోమవారం వనమహోత్సవం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో చెరువు చుట్టూ ఔషధ వృక్షా లను నాటి, పరిసరాల పచ్చదనాన్ని పెం పొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్ వనమహోత్సవాన్ని ప్రారంభించి, ఔషధ మొ క్కలను నాటారు. ఈ సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ టి కృష్ణమోహన్‌రెడ్డి, టీఎస్‌ఐజి డైరెక్టర్ అర్చన సురేష్, లేక్ ప్రొటెక్షన్ సెల్ అధికారి కృష్ణారావు, జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి,
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) పి. చంద్రశేఖరరెడ్డి, ధ్రువంశ్ ప్రతినిధి మాధులిక చౌధరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఆరు నెలలుగా చెరువు పునరుద్ధరణ పనుల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు.
వేగంగా పెరిగిన పట్టణీకరణ, కాలుష్యం వల్ల చెరువు తీవ్ర నష్టాన్ని చవిచూసిందని అధికారులు తెలిపారు. ఎమ్మె ల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. పునరుద్ధరణ పనులు ప్రారంభ మైన తర్వాత నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందన్నారు. టీఎస్‌ఐజి డైరెక్టర్ అర్చన సురేష్ తదితరులు పాల్గొన్నారు.