19-05-2025 06:57:06 PM
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు..
హుజురాబాద్ (విజయక్రాంతి): పేదలకు చేయూత సీఎంఆర్ఎఫ్ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణబ్ బాబు(Congress Party Constituency Incharge Vodithala Pranav Babu) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 22 లక్షల 48 వేల ఐదువందల విలువగల చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది అభాగ్యులకు చేయూత అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, మాజీ జెడ్పిటిసి తోట రాజేంద్రప్రసాద్, మండల అధ్యక్షుడు కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, మాజీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వేముల పుష్పలత పాల్గొన్నారు.