14-01-2026 02:26:29 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్ర నగర్ జనవరి 13 (విజయక్రాంతి) : ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆ ర్ఫ్ ఎఫ్ ) ఒక వరంలాంటిదని రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్ అన్నారు.
మంగళవారం కాటేడాన్, శాంతి నగర్ చెందిన లాల్ ముత్వద్ కుమారుడు సాకేత్ లాలుకు కోఠి ఈ ఎన్‌టి హాస్పిటల్ వారు పరికరం అమర్చీడానికి సీఎం రిలీఫ్ కింద మంజూరైన రూ.7 లక్షల రూపాయల విలువైన ఎల్‌ఓసి పత్రాలను బాధితులకు ఆయన స్వయంగా అందజేశారు. ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ భారీ మొత్తంలో ఎల్‌ఓసి మం జూరు కావడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.