02-05-2025 12:00:00 AM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషిరాబాద్, మే 1 (విజయక్రాంతి): సీఎం సహాయనిది పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ ని యోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న 20 మంది లబ్ధిదారులకు రూ. 6,49, 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పేదలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ వివి ధ డివిజన్ల అధ్యక్షులు రాకేష్ కుమార్, వల్లా ల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్, కార్యదర్శి ఆకుల అరుణ్ కుమా ర్, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు, ముఠా నరేష్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముదిగొండ మురళి, పున్న సత్య నారాయణ, ఖలీల్, శ్రీహరి, కుమారస్వామి, నర్సింగ్, సత్తి, యాదగిరి పాల్గొన్నారు.