01-05-2025 11:07:22 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల గత పది రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించడం జరిగింది. రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ లో తెలంగాణ ముఖ్యమంత్రితో విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల చర్చలు జరగడం జరిగింది. ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అధ్యాపకులకు అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందని, మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో పాటు యుజిసి పే స్కేల్ అమలు చేస్తామని, కాంట్రాక్ట్ అధ్యాపకులు యొక్క సేవలు మరువరానివి, కచ్చితంగా తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ ప్రతినిధులైన తెలంగాణ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ జోష్ణ, డాక్టర్ శరత్, డాక్టర్ నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆదేశాలతో తెలంగాణ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్, రిజిస్టార్ ఆదేశాల మేరకు దక్షిణ ప్రాంగణంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, డాక్టర్ టి ప్రతిజ్ఞ కాంట్రాక్ట్ అధ్యాపకులకు నిమ్మరసాన్ని ఇచ్చి సమ్మెను విరమించ విరమింప చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల కోఆర్డినేషన్ కమిటీ నెంబర్ డాక్టర్ నారాయణగుప్త మాట్లాడుతూ.... ప్రభుత్వంపై విశ్వాసంతో తాము సమ్మె విరమించామని తమకు ఉద్యోగ భద్రత కల్పించి, యుజిసి పే స్కేల్ కల్పిస్తే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, తమపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.