14-08-2025 08:07:57 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా సీరోల్ పోడు భూముల పట్టాల కోసం మద్దతుగా వెళ్లిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS State Secretary R.S. Praveen Kumar)ను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ వరంగల్ పోలీస్ హెడ్ కోటర్స్, అంబేద్కర్ విగ్రహం సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను స్వేరోస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. అనంతరం స్వేరోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారపల్లి మనోజ్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి ప్రజలు ప్రజలకు హామీ ఇచ్చిన ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదని నెరవేర్చలేదని, విద్యారంగా సమస్యలను తుంగలో తొక్కినట్టు విద్యాశాఖను తల దగ్గరే ఉంచుకొని విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
ఫీజు రీయింబర్మెంట్ విషయంలో గత ప్రభుత్వము తానా అంటే ప్రస్తుతం ప్రభుత్వం తందానా అనే లాగా గతంలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ చెల్లించకపోవడం వల్ల కళాశాల నుంచి టీసీలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. ఫీజు రియంబర్మెంటు బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులు న్యాయం చెల్లించాలన్నారు. లేనియెడల దశలో వారిగా ఆందోళన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంద శ్యామ్ మాట్లాడుతూ, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్యగా అభివర్ణించాడు. పోడు భూముల పట్టాలు అడగడానికి నిరసన తెలిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముక్తకంఠంతో తెలంగాణ యావత్ సమాజం ఖండించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ విద్యార్థి నాయకులు మంద శ్యాంసుందర్, శ్రీనివాస్, సిద్దు బొట్ల ప్రశాంత్, సురేష్, మందకుమార్, చిలమల్ల వేణుగోపాల్, మహిపాల్, వంశీ, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.