calender_icon.png 14 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

14-08-2025 07:59:05 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ముందస్తుగా శ్రీ కృష్ణాష్టమి(Krishna Janmashtami) వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలలో ఆధ్యాత్మిక భక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అంజాగౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెరుగు అంజా గౌడ్ ప్రధాన కార్యదర్శి ఆరుట్ల మహేష్ రెడ్డి ఉపాధ్యక్షుడు దాకూరి నాగరాజు కోశాధికారి కాల్వ బాలాజీ గోపిశెట్టి సంతోష్ సలహాదారులు గందె రమేష్,కోయ రాము, పాఠశాల అధ్యాపక బృందం  తదితరులు పాల్గొన్నారు.