22 March, 2026 | 9:31 AM

సింగరేణి ఓసీపీలలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

22-07-2024 12:12 AM

పెద్దపల్లి, జూలై 21 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నది. శనివారం రాత్రి నుంచి ఎడ తెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో సింగరేణి ఆర్జీ పరిధిలోని ఓసీపీ ఆర్జీ పరిధిలోని ఓసీపీ 1,3, ఆర్జీ పరిధిలోని ఓసీపీ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఆదివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులలో వర్షం కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఓసీపీల్లో క్వారీలోకి వర్షపునీరు వచ్చి చేరుతుండటంతో పని స్థలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓసీపీల్లో ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.