22 March, 2026 | 11:02 AM

ప్రజలను అప్రమత్తం చేయాలి : కలెక్టర్

22-07-2024 12:11 AM

జయశంకర్ భూపాలపల్లి, జూలై 21(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని ఘనపురం మండలం మోరంచవాగు, ఘనపసముద్రం చెరువును ఆయన పరిశీ లించారు. నాలుగు రోజులుగా జిల్లా లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ క్రమంలో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. గత ఏడాది జరిగిన ఆస్తినష్టం, ప్రాణనష్టం పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను అప్రమ త్తంగా చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.