06-11-2025 11:25:13 PM
బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్
మిడ్జిల్: రాష్ట్రంలో పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశవ్యాప్తంగా ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు సొమ్ముకేంద్రానిది.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిదని బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు నెరవేర్చని తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తున్నటువంటి బ్యాగులపై ఆరు గ్యారెంటీలు రాస్తూ ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
తప్పుడు ప్రచారంతో సన్నబియ్యం మేమే ఇస్తున్నట్లుగా సొమ్ముకేంద్ర ప్రభుత్వానికి అనే నిజాన్ని కప్పిపుచ్చుతూ సోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానివి అన్నట్లుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. అనంతరం స్థానిక బిజెపి నాయకులతో కలిసి తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, నాయకులు నరేందర్, శేఖర్, వెంకట్ రెడ్డి, ఎల్లయ్య, భీమయ్య, వెంకటయ్య, బుచ్చయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.