06-11-2025 11:34:55 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిపైన, ఆరు గ్యారంటీలపైన సుదీర్ఘంగా చర్చించుకున్నారు.