calender_icon.png 7 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాన్ని ధర్మంగా నిర్వహించినప్పుడు గుర్తింపు లభిస్తుంది

06-11-2025 11:19:02 PM

రిటైర్డ్ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): విధులను నిక్కచ్చిగా ధర్మాంగా నిర్వహించినప్పుడే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పదవి విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల బతుకులు మారలేదు అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన వేతనాలు అడుక్కునే స్థాయికి ఉద్యోగులు వచ్చారన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం చేసిందన్నారు.

ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నీలక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వరు లేకుండా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్న అన్నారు. డిఏలు ఏరియర్స్ ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ సొమ్మును కూడా ప్రభుత్వం రిటైర్మెంట్ సమయంలో ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం తగదన్నారు. ఏ ప్రభుత్వమైన ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. టీజీ ఎస్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ కలిసికట్టుగా అన్ని ఉద్యోగులు సంఘాలు ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిన్న చూపు చేస్తున్నాయన్నారు. సంఘటితంగా ఉండే సమస్యల పరిష్కారానికి ప్రతి ఉద్యో గి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం పోరాటం చేస్తుందన్నారు. పదవి విరమణ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని పలు శాఖల ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, నిజాంబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటేపల్లి నగేష్ రెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టీఎన్జీవో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, రిటైర్డ్ జిల్లా రవాణా శాఖ అధికారి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారి వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.