calender_icon.png 7 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన కోదండరెడ్డి

06-11-2025 11:11:34 PM

ఇబ్రహీంపట్నం: ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గురువారం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం యాచారం గ్రామంలోని రూ.4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. కాగా యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది.

ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబందించిన అధికారికంగా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ హర్షన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ తదితరులు పాల్గొన్నారు.