06-11-2025 11:32:50 PM
హన్వాడ: మండలం పరిధిలోని ఎనమిదితండా గ్రామంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి వారికి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఎనమిది తండా బూత్ అధ్యక్షులు విశాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రఘు రామ్ గౌడ్, లింగం నాయక్, శిల్వా నాయక్, రమేష్, రవీందర్, మల్లేష్, రంగన్న, రవి, గ్రామ పెద్దలు యువకులు, చిన్నారులు ఉన్నారు.