06-11-2025 11:21:29 PM
మిడ్జిల్: మండల పరిధిలోని వస్పుల జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి విద్యార్థి బి చరణ్ రాష్ట్రస్థాయి అండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య తెలిపారు. 5న నారాయణపేట జిల్లా కోస్గి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో నిర్వహించిన హ్యాండ్ బాల్ పోటీలలో జిల్లా మిడ్జిల్ మండలం వస్పుల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన బి చరణ్ ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 7 నుండి 9 వరకు కోస్గిలో జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ లో బి చరణ్ పోటీలలో ఆడనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అండ్ బాల్ పోటీలకు ఎంపికైన బి చరణ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ శంకర్ నాయక్ ఉపాధ్యాయులు కల్పన, నికత్ జాన్ తదితరులు పాల్గొన్నారు.