calender_icon.png 22 November, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల బదిలీలను వెంటనే అమలు చేయాలి...

09-02-2025 11:30:23 PM

సెంట్రల్ స్పౌజ్ ఫోరం అధ్యక్షుడు కుమారస్వామి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల భార్య భర్తల బదిలీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం అధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి నారాయణలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల సర్ధుబాటు పేరుతో ఏర్పాటు చేయబడిన జీఓ నెంబర్ 317 బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారి స్వంత జిల్లాలకు పంపుతామని ఇచ్చిన వాగ్ధానం మేరకు స్పౌజ్ బాధితులను భార్యా భర్తలను ఒకే లోక్‌ల్ క్యాడర్‌కు తీసుకురావడానికి జీఓ 317 కొన్ని సవరణలు చేసి 864 మంది రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ, లోకల్ బాడీలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలతో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకోకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పౌజ్ ఉద్యోగ ఉపాధ్యాయులను ఒకే చోట ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు రవీందర్, శైలజ, ప్రవీణ, సంధ్య, సంఘమిత్ర, కవిత, నాందేవ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.