calender_icon.png 29 January, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటోన్మెంట్ విలీనం కోసం లక్ష సంతకాల సేకరణ

29-01-2026 12:00:00 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనే మొదటి సంతకం

సికింద్రాబాద్ జనవరి 28 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు, సోషల్ మీడియా అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం ఎమ్మెల్యే జోకర్ దీక్ష విరమణ చేయడాని ఆయన తప్పు పట్టారు.

కంటోన్మెంట్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు, స్థానిక బీజేపీ మొదటి నుండి అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, ఎనిమిది రోజుల పాటు సాగిన దీక్షకు కనీసం కాంగ్రెస్ మంత్రి కూడా రాకపోవడం, అకస్మాత్తుగా ఎమ్మెల్యే దీక్ష విరమించడం చూస్తుంటే,ఇది కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనని, అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా చాటిచెప్పేందుకు బీఆర్‌ఎస్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ ఉద్యమానికి మద్దతుగా తొలి సంతకాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మొదలుపెట్టారు.

తద్వారా కంటోన్మెంట్ విలీనంపై ప్రజల్లో ఉన్న బలమైన ఆకాంక్షను వారికి తెలియజేస్తాం అన్ని మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, ఉద్యమకారులు కంటోన్మెంట్ విలీనానికి అనుకూలంగా ఉన్న నాయకులు,విలీనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ, పార్టీలకు,సంఘాలకు అతీతంగా ఈ లక్ష సంతకాల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బి ఆర్‌ఎస్ సోషల్ మీడియా అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విజ్ఞప్తి చేశారు.