calender_icon.png 29 January, 2026 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల స్థాయి సియం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

29-01-2026 04:31:19 PM

మఠంపల్లి జనవరి 29:సూర్య పేట మఠం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీల్యా నాయక్ తండ నందు సియం కప్ -2025-26 మండల స్థాయి  క్రీడ పోటీలకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి కె.వెంకటాచారి,స్థానిక గ్రామ సర్పంచ్ బానోతు రాముడు నాయక్ హాజరై ప్రారంభించినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.రాము  మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని, దేహదారుడ్యాన్ని పెంపొందిస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిసర గ్రామ సర్పంచులు గోవింద నాయక్ చిరంజీవి,ఉపసర్పంచులు,సెక్రటరీలు,గ్రామ పెద్దలు, వెంకటేశ్వరరావు,స్థానిక పాఠశాల పిడి ఎమ్.నరేష్,వివిధ పాఠశాలల పిడి లు,పిఇటి లు, ఉపాధ్యాయులు క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి హాజరైన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ బానోతు రాముడు నాయక్  ప్రైజులు,భోజన వసతి  వివిధ రకాల మౌలిక సదుపాయాలు మొత్తం ఆయనే కల్పించినారు.