29-01-2026 12:00:00 AM
ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు
పౌర విమానయాన శాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో భారీ ఈవెంట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): భాగ్యనగర ఆకాశంలో లోహ విహంగాలు అద్భుత విన్యాసాలతో కనువిందు చేస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా ప్రతిష్ఠాత్మక వింగ్స్ ఇండి యా ప్రదర్శన బుధవారం వైభవంగా ప్రా రంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎయిర్ షో వేడుకను ప్రారంభించి, పౌర విమానయాన రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి ని కొనియాడారు. పౌర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్‌ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శన ఈ నెల 31 వరకు కొనసాగనుంది.
ప్రారంభోత్సవం అనంతరం వివిధ దేశాలు, సంస్థలకు చెంది న విమానాలు నింగిలో చేసిన సాహసోపేత విన్యాసాలు సందర్శకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ముఖ్యంగా అత్యాధునిక వాణిజ్య విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ఫ్లయిట్లు ఆకాశంలో రంగురంగుల పొగల ను చిమ్ముతూ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాల్లో పల్టీలు కొడుతూ, ఒకదానికొకటి అతి సమీపంగా దూసుకుపోతూ పైలట్లు చూపిన ప్రతిభ అబ్బురపరిచింది. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విమానయాన సంస్థలు, విమాన తయారీ కంపెనీలు పాల్గొంటున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన విభిన్న రకాల విమా నాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
విమానయాన రంగంలో వస్తున్న మార్పు లు, కొత్త ఆవిష్కరణలను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను రూపొందించారు. కేవలం విన్యాసాలే కా కుండా, విమానయాన రంగ పెట్టుబడులు, ఒప్పందాలకు కూడా వింగ్స్ ఇండియా ఒక కీలక వేదికగా మారనుంది. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిం చనున్న ఈ వైమానిక సంబరాలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. పౌర విమానయాన రంగంలో వ్యాపార అవకాశాలను మెరుగుపరచడంతో పాటు, సామాన్య ప్రజలకు కూడా ఈ రంగంపై అవగాహన కల్పించడ మే ఈ ఈవెంట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.