18 April, 2026 | 2:30 PM

జిల్లా కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

09-05-2025 08:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షల సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపినవారిలో వివిధ శాఖల అధికారులు గోవింద్, జీవరత్నం, శ్రీనివాస్, విజయలక్ష్మి, నరసింహారెడ్డి, అశోక్, శంకరయ్య, రామ్ గోపాల్, విష్ణువర్ధన్, భాలిక్ అహ్మద్, రాజేందర్, సుభాష్ తదితరులు ఉన్నారు.