25-07-2025 08:11:38 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): గంగమ్మ వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామం సమీపంలోని గంగమ్మ వాగు బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.3 కోట్లు వ్యయం అవు తుందన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు, ట్రాఫిక్‌కు బ్రిడ్జ్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గంగమ్మ వాగు పనుల పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ మోహన్, డీఈఈ వినోద్ కుమార్ పాల్గొన్నారు.