25-10-2025 12:19:29 AM
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మోట కొండూరు మండల ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం దళితుల భూములను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒత్తిడితో అధికారులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అట్టి భూమి హక్కుదారులైన వంగపల్లి రామయ్య, చెరుకు మొగులమ్మ, నవీన్ లు ఆర్డిఓ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. భూములు కోర్టు వివాదం లో ఉన్నప్పటికీ తీసుకునే ప్రయత్నం చేస్తుండడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు చెందిన లావాని పట్ట 1.10 ఎకరాల భూమిని కురుమ కులానికి చెం దిన బండి నరసయ్య అని వ్యక్తి తన భూమి అంటూ ఎమ్మెల్యే మద్దతుతో ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి ఇస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గెలవడానికి ఒక కురుమ కులానికి చెందిన వారే ఓట్లు వేయలేదు దళిత వర్గాలమైన తాము కూడా కాంగ్రెస్కు ఓట్లు వేశామనేది ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని అన్నారు. అధికారులు సర్వే జరిపి తమకు తగు న్యా యం చేయాలని మైసయ్య రవీందర్ చెరుకు సునీల్ కుమార్ చెరుకు అనిల్ కుమార్ కొల్లూరు బిక్షపతి హరిబాబు వంగపల్లి శ్రీకాంత్ కొల్లూరి శ్రీకాంత్ కొల్లూరి రాజులు ఆర్డిఓను కోరారు.